/rtv/media/media_files/2025/09/18/javelin-throw-2025-09-18-17-33-25.jpg)
టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. గత ఏడేళ్లలో తొలిసారిగా ఆయన ఓ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఖాళీ చేతులతో వెనుతిరిగాడు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఓడిపోయి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Final. Men's Javelin Throw at World Athletics Championships in Tokyo25. #IndianAthleticspic.twitter.com/kGeDqqQGLp
— SportsBackstory (@Sportsbackstory) September 18, 2025
గత రాత్రి జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ 84.03 మీటర్లు మాత్రమే జావెలిన్ త్రో విసరగలిగాడు. ప్రపంచ ఛాంపియన్‌గా తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశించిన నీరజ్‌కు ఈ ఫలితం నిరాశ కలిగించింది. ఈ టోర్నీలో అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 90.23 మీటర్లు. అతను 85 మీటర్ల మార్కును ఒక్కసారి కూడా దాటలేకపోవడం గమనార్హం. ఫైనల్స్‌లో అతని ఐదవ ప్రయత్నం ఫౌల్ కావడంతో, నీరజ్ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ పోటీలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషార్న్ వాల్కాట్ 88.16 మీటర్ల త్రోతో బంగారు పతకం సాధించాడు. భారత అథ్లెట్ సచిన్ యాదవ్ 86.27 మీటర్ల త్రోతో 4వ స్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో నీరజ్‌తో పాటు అందరి దృష్టినీ ఆకర్షించిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా నిరాశపరిచాడు. అతను 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Neeraj Chopra finishes 8th
— IndiaSportsHub (@IndiaSportsHub) September 18, 2025
At #WorldAthleticsChamps with 84.03m his 1st finish outside Top 2 since 2021, ending an extraordinary 26 event podium streak.
On the same runway where he gave India Olympic gold, his title defence slipped away.
But legends aren’t defined by… pic.twitter.com/r7G2JsToCM