/rtv/media/media_files/2025/09/22/ind-vs-pak-match-2025-09-22-07-28-14.jpg)
2025 ఆసియా కప్(Asia cup 2025) లో భాగంగా సూపర్ 4లో భారత్-పాకిస్తాన్(ind-vs-pak) మధ్య జరిగిన మ్యాచ్ నిమిష నిమిషానికి ఉత్కంఠగా మారింది. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మాన్ గిల్ తొలినుంచే పాక్ బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకపడ్డారు. దీంతో పాక్ బౌలర్లు సహనం కోల్పోయారు. మధ్యమధ్యలో భారత ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ బౌండరీ కొట్టాడు.
Also Read : వాటే ఇన్నింగ్స్.. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ, రౌఫ్‌ల మధ్య మాటల యుద్ధం
బౌండరీ తర్వాత, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, రౌఫ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ ముఖాముఖి తలపడటంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరినీ విడదీశారు. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ స్పందిస్తూ, పాకిస్థాన్ ఆటగాళ్లు అనవసరంగా దూకుడుగా ప్రవర్తించారని, అందుకే తాను బ్యాట్‌తోనే వారికి సమాధానం ఇచ్చానన్నాడు. అంతకు ముందు, షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో కూడా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వాగ్వాదానికి దిగారు.
చివరికి అభిషేక్(abhishek-sharma) 74 (39) పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికి భారత్ 12.2 ఓవర్లలో 123/3తో ఉంది. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అభిషేక్ 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదగా, గిల్ ఎనిమిది ఫోర్లు బాది తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు గానూ అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డును గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గిల్ తన పోస్ట్‌లో, “ఆట మాట్లాడుతుంది, మాటలు కాదు” అని రాయగా, అభిషేక్ మ్యాచ్ “మీరు మాట్లాడండి, మేము గెలుస్తాము” అని క్యాప్షన్ ఇచ్చాడు.
You talk, we win 🇮🇳 pic.twitter.com/iMOe9vOuuW
— Abhishek Sharma (@OfficialAbhi04) September 21, 2025
Game speaks, not words 🇮🇳🏏 pic.twitter.com/5yNi2EO70P
— Shubman Gill (@ShubmanGill) September 21, 2025
6 వికెట్ల తేడాతో విజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం కావడం విశేషం. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అటు పాకిస్థాన్ మంగళవారం శ్రీలంకతో తలబడనుంది.