Malla Reddy: తూచ్...నేనలా అనలేదు.. అప్పుడే రిటైర్మెంట్ ఏంటీ? మాట మార్చిన మల్లారెడ్డి
రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అలా అనలేదంటూ మాట మార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం, బీజేపీలోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదే అన్నారు.