Grok AI: దిగివచ్చిన గ్రోక్ ..ఇమేజ్ జనరేషన్ కు పరిమితులు

ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ తన ఇమేజ్ జనరేషన్‌పై పరిమితి విధించింది. ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌ను ప్రీమియమ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లిస్తేనే ఇకపై ఫీచర్ ను ఉయోగించుకోవచ్చును. 

New Update
AI grok musk

AI grok musk Photograph: (AI grok musk)

ఎక్స్ ఏఐ చాట్ బాట్ గ్రోక్ చాలా వేంగా జనాల్లోకి చొచ్చుకుని పోయింది. ప్రస్తుతం ఏఐ జనరేషన్ లో కావాల్సినవన్నీ అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇందులో ఉన్న ఇమేజ్ జనరేషన్ పై మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం అయింది. ఈ వేదికలో అశ్లీల, అసభ్యకర దృశ్యాల క్రియేట్‌ అవుతున్నాయి అంటూ చాలా మంది నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఎక్స్ టీమ్ చర్యలు తీసుకుంది. ఇమేజ్ జనరేషన్ పై పరిమితిని విధించింది. ఇక మీదట ఎవరు పెడితే వారు వాడకుండా స్ట్రిక్ట్ చేసేసింది. కొత్త రూల్స్ ప్రకార్ గ్రోక్ ఇమేజ్ జెనరేషన్ ను వాడుకోవాలంటే ప్రీమియమ్ సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మొత్తానికి అంటే డబ్బులు చెల్లించేవారు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించేలా నిర్ణయం తీసుకుంది.

‘రిమూవ్ దిస్ పిక్చర్’ ట్రెండ్‌

మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్‌ అనుసంధానంగా ఉన్న గ్రోక్‌ సాయంతో ఇటీవల కొందరు అసభ్యకర చిత్రాలు సృష్టిచారు. మహిళల ఫొటోలను ఇబ్బందికరంగా మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది.  ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్న Grok AI కారణంగా మహిళలు, పిల్లల గోప్యతకు భంగం కలుగుతోందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ (MeitY), 'X' సంస్థకు అధికారికంగా నోటీసులు పంపింది. ద్వారా అశ్లీల, అసభ్య, లైంగికంగా అవమానకరమైన కంటెంట్ తయారవుతోందని, ముఖ్యంగా మహిళల ఫోటోలను అనుమతి లేకుండా మార్ఫ్ చేసి షేర్ చేస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది. ఇది కేవలం అనైతికమే కాదు, చట్టవిరుద్ధమని కూడా పేర్కొంది.  అలాంటి కంటెంట్ మొత్తం తొలగించాలని ఎక్స్ ను  ఆదేశించింది. ఇండియాలానే యూరోపియన్ యూనియన్, మలేసియా, ఫ్రాన్స్ , బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీంతో ఎక్స్ మొత్తానికే ఆ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ను రిస్ట్రిక్ట్ చేసేసింది. 

Advertisment
తాజా కథనాలు