Traffic Jam: విజయవాడ హైవేపై వాహనాల రద్దీ...ప్రత్యామ్నాయ మార్గాలివే...

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌కు పయనమైంది. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రాంతం వారు సొంతూళ్లకు పయనమవ్వడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది.

New Update
FotoJet - 2026-01-10T125014.325

Traffic jam on Vijayawada highway

Traffic Jam : సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌కు పయనమైంది. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రాంతం వారు సొంతూళ్లకు పయనమవ్వడంతో హైదరాబాద్-విజయవాడ హైవే(hyderabad-vijayawada-highway) పై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. శనివారం ఉదయానికి రద్దీ మరింత ఎక్కువైంది. హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌(Choutuppal), పంతంగి టోల్‌ ప్లాజా(toll-gates) వద్ద వాహనాల బారులు(traffic-jam) కనిపిస్తున్నాయి. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. యాదాద్రి–భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు  సాగర్‌ హైవే మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే ఆ మార్గా్ల్లోనూ వాహనాలు భారీగా చేరుకున్నాయి.

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులతో ఎంజీబీఎస్, జేబీఎస్‌లో రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్‌, తార్నాక కూడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు రైల్వేస్టేషన్లలో కూడా రద్దీ పెరిగింది.

Also Read :  డిగ్రీలో ఇక మీదట ఇంటర్న్‌షిప్‌.. వచ్చే ఏడాది నుంచే అమలు

ఈ మార్గాల్లో ప్రయాణిస్తే...

హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీ వాసులు నగరం నుంచి తమ సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. అయితే ప్రయాణీకులు గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వారు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారిపై నుంచి వెళ్లారు. వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. అయితే కొంత దూరం పెరిగినా వీరంతా హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుందని అధికారులు తెలుపుతున్నారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లాలనుకునేవారు బొంగుళూరు గేట్‌ వద్ద ఎగ్జిట్‌ తీసుకొని.. నాగార్జునసాగర్‌ హైవేపైకి వెళ్తే ఈజీగా జర్నీ చేయడానికి వీలుంటుందని వారు తెలిపారు.

ఇక ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవడం ద్వారా నార్కట్‌పల్లి దాటితే వీరు ట్రాఫిక్‌ తిప్పలు తప్పించుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్‌ఆర్‌ పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్‌ తీసుకొని.. వరంగల్‌ హైవేలోకి ప్రవేశిస్తే ప్రయాణం ఈజీ. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్‌ మీదుగా కూడా నేరుగా భువనగిరికి చేరుకోవడానికి అవకాశం ఉంది.ప్రతి ఆదివారం చౌటుప్పల్‌లో సంత జరుగుతుంది. ఆ రోజు చౌటుప్పల్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ ట్రాఫిక్‌ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ఉత్తమం అని అధికారులు సూచిస్తున్నారు.

Also Read :  నిజామాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌? కవిత రాజీనామాతో లైన్‌ క్లియర్‌?

రెండు రోజులు తప్పని రద్దీ

శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. శనివారం నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, శని, ఆదివారాలు ఉద్యోగులకు సెలవులు కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణీకులు పల్లెలకు ప్రయాణమయ్యారు. దీంతో  వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసివేశారు. వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు  చేపడుతున్నారు. అయితే శని, ఆదివారాలు రద్దీ కొంత ఎక్కువగా ఉంటుందని ఆ తర్వాత పెద్దగా రద్దీ ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisment
తాజా కథనాలు