Internship: డిగ్రీలో ఇక మీదట ఇంటర్న్‌షిప్‌..వచ్చే ఏడాది నుంచే అమలు

నైపుణ్యాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం కొలువులు లభిస్తున్నాయి. ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు సైతం ఆయా సంస్థల అవసరాలకు తగినట్లు పనిచేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న డిగ్రీలో నైపుణ్యాలు పెంచే దిశగా విద్యాశాఖ రంగంలోకి దిగింది.

New Update
usa

Students Internship

Internship : సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు పదవతరగతి తర్వాత ఇంటర్‌ ఆ తర్వాత డిగ్రీ చేస్తుంటారు. అయితే ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌ రాస్తే ఇంజినీరింగ్‌ లేదా మెడిసిన్‌ వైపు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారికి లభించిన నైపుణ్యం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడానికి మార్గం ఉంటుంది. అయితే నేరుగా డిగ్రీ, ఆ తర్వాత పీజీ ఇలా వెళ్లిన వారిలో నైపుణ్యాలు కొంత తక్కువే.  దీంతో నైపుణ్యాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం కొలువులు లభిస్తున్నాయి.  ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు సైతం ఆయా సంస్థల అవసరాలకు తగినట్లు పనిచేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న డిగ్రీలో నైపుణ్యాలు పెంచే దిశగా విద్యాశాఖ రంగంలోకి దిగింది. ప్రాథమికంగా చర్చించాక రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. డిగ్రీ మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్‌లో ఈ అవకాశం కల్పించాలని భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం(2026-27)లో ఇంటర్న్‌షిప్‌(internship-jobs)/అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. తద్వారా వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల్లో తగిన స్థానం లభిస్తుందని భావిస్తోంది.

Also Read :  నిజామాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌? కవిత రాజీనామాతో లైన్‌ క్లియర్‌?

ఎలా? ఎక్కడ?

ఇంటర్న్‌షిప్‌ అనేది ప్రస్తుత సమయంలో తప్పనిసరి. అంటే విద్యార్థులు వివిధ పరిశ్రమలు, కార్యాలయాలు, దుకాణాల్లో కొన్నాళ్ల పాటు ఉద్యోగంలా పనిచేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది పని అనేకంటే కూడా శిక్షణ అనడం సముచితంగా ఉంటుంది. అయితే ఉచితంగా ఇంటర్న్‌షిప్‌ చేయాలంటే ఎవరైనా అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అందులోనూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వారిలో అధికశాతం మంది పేద, దిగువ మధ్యతరగతి వారుంటున్నారన్నది నిజం. అందుకే ప్రభుత్వం వారికి ఇంటర్న్‌షిప్‌ కాలానికి నెలకు కొంత స్టైపెండ్‌ చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు ఆయా వర్సిటీలు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆ మొత్తాన్ని చెల్లించేలా ప్లాన్‌ చేస్తోంది. వర్సిటీలు తమకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లిస్తాయి. కొంత మొత్తం విద్యామండలి తన వాటాగా ఇస్తుంది. ఆయా పరిశ్రమలు ఇంకొంత చెల్లించేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా కసరత్తు కొనసాగుతోంది. - Internship-based AI ML degree in Hyderabad

అమలు నోచని ప్రతిపాదన

నిజానికి ఇది కొత్త విషయం ఏం కాదు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ నియంత్రణ సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ చాలాకాలంగా చెబుతూ వస్తున్నాయి. ఏఐసీటీఈ దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అయినా అధిక శాతం మంది బీటెక్‌ విద్యార్థులకే ఇంటర్న్‌షిప్‌ అమలు కావడంలేదు. ఆయా విద్యాసంస్థలతో పరిశ్రమలకు అనుసంధానం లేదు. ఫలితంగా ఇంటర్న్‌షిప్‌ కొన్ని ప్రముఖ కళాశాలలకే పరిమితమైంది. దీంతో ఆయా కళాశాలల విద్యార్థులకే అవకాశాలు లభిస్తున్నాయి.

Also Read :  నగరానికి సంక్రాంతి శోభ.. పల్లెబాటపట్టిన పట్టణం

చేతులెత్తేసిన యూనివర్సిటీలు

అయితే రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్‌ సిలబస్‌ను ఉన్నతీకరించేందుకు.. బీటెక్‌ విద్య స్వరూపాన్ని ఇప్పటికి అనుగుణంగా మార్చేందుకు ఒక నిపుణుల కమిటీనీ నియమించింది. ఆ నిపుణుల కమిటీ పలు సిఫారసులు చేసింది. బీటెక్‌ రెండో ఏడాది రెండో సెమిస్టర్‌లో ఒకటి, మూడో ఏడాది రెండో సెమిస్టర్‌ పూర్తయ్యేనాటికి మరొకటి ఇండస్ట్రియల్‌ ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేయడం తప్పనిసరని తన నివేదికలో పేర్కొంది.  అయితే తమకు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికే ప్రతినెలా ఇబ్బంది అవుతోందని, అభివృద్ధి పనులకు నిధులు అసలే లేవని వర్సిటీలు మొత్తుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ విద్యార్థులకు స్టైపెండ్‌ ఎలా చెల్లించగలమని వైస్‌ ఛాన్స్‌లర్లు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటర్న్‌షిప్‌ అనేది ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తున్నది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్‌షిప్‌ అమలు చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. మరీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది తేలాల్సిన అంశం.

Advertisment
తాజా కథనాలు