పాక్లో ఆత్మాహుతి దాడి.. ఆరోపణలను ఖండించిన భారత్!
పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో భారత్ హస్తం ఉందనే వాదనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉత్తర వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో భారత్ హస్తం ఉందనే వాదనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉత్తర వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది చేరారు.
తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.
గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు.
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో గందరగోళం నెలకొంది. విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు.
రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయని తెలిసింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
పాకిస్తాన్లో నేడు భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.