/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/prabhas-1-jpg.webp)
Prabhas Salaar Movie Postponed: తెలుగు హీరోల్లో మొట్టమొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు కష్టాలు తప్పడం లేదు. బాహుబలి (Baahubali) తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్సాపీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. సరేలే పోనీ అవన్నీ పోయిన కేజీఎఫ్ లాంటి సంచలన సినిమా చేసిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో టాలీవుడ్ హంక్ హిట్ కొడతాడులే అనుకుంటే...ఇప్పుడు అది కూడా రిలీజ్ చేయడం లేదు వాయిదా వేస్తున్నాం అని అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలేనే దీన్ని తన ఎక్స్ మీడియా ఖాతాలో ప్రకటించింది.
చాలా రోజుల నుంచి ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ పార్ట్ 1 రిలీజ్ అవదు. వాయిదా పడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దాన్నిఏ ఇవాళ నిర్మాణ సంస్థ ఖాయం చేసింది. కొన్ని కారణాల వలన అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడం లేదని చెప్పింది. త్వరలోనే కొత్త విడుదల డేట్ ను ప్రటిస్తామని తెలిపింది. మూవీ మరింత బాగా రావడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మూవీ మేకర్స్ చెబుతున్నారు. అభిమానులు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నామని కోరారు.
We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances.
Please understand this decision is made with care, as we're committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/abAE9xPeba— Hombale Films (@hombalefilms) September 13, 2023
అభిమానులకు మంచి సినిమా అందివ్వడం కోసమే మూవీ రిలీజ్ ను వాయిదా వేసామని చెబుతున్నారు. మీ కోసం మా టీమ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెబుతున్నారు. సలార్ కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినిమా వాయిదా పడిందనేసరికి నిరాశ చెందుతున్నారు.
Also Read: పక్కా ప్లాన్ తో వస్తున్న ఎన్టీయార్ దేవర