మహారాష్ట్రలో సీఎం ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ కీలక ఆదేశాలు!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రేపు మధ్యాహ్నానికి ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయి.
తనను సీఎం చేయకపోతే ప్రభుత్వంలో శివసేన చేరదని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా పని చేసి.. కూటమిని మళ్లీ అధికారంలోకి తెచ్చానని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని తీసుకోనని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీంతో దాదాపు 11 వేల గ్రామాలకు వీఆర్వోలు రానున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఉప సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు.. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి ఛాన్స్.. కలెక్టర్లకు సర్పంచ్ ను సస్పెండ్ చేసే అధికారం తొలగింపు.. లాంటి అనేక రూల్స్ ను తీసుకురానుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తేవాలని భావిస్తోంది.
తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను చంద్రబాబు TDP రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. తీగలతో పాటు ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా TDPలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది.
మహేశ్ బాబు బావా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. చంద్రబాబు సైతం ఈ అంశంపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు.
ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమి నేపథ్యంలో ఈ రోజు జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. ఐక్యంగా లేకపోతే ఎలా గెలుస్తాం? అంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్ నాథ్ శిండే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి మీటింగ్ రద్దు అయినట్లు సమాచారం. అనూహ్యంగా ఆయన సొంతూరు సతారాకు వెళ్లిపోవడంపై చర్చ సాగుతోంది.