/rtv/media/media_files/2025/01/24/FPZMzrOyHqeJIrY20CNS.jpg)
kishan reddy Photograph: (kishan reddy)
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దావోస్(Davos) పర్యటనలో విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలి.. కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వారికే కాంట్రాక్టులు కట్టబెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బీజేపీ(BJP) పార్టీ ఆఫీస్ ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్(Congress) పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ వారిని అక్కడికి తీసుకెళ్లి దావోస్ లో అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పెట్టుబడుల ఒప్పందాలు పేపర్ల వరకే పరిమితం కావద్దని తెలంగాణ ప్రభుత్వానికి సికింద్రాబాద్ ఎంపీ సూచించారు.
Also Read: భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
Also Read: ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ దుర్వినియోగం..
నెహ్రు కుటంబం మాత్రమే దేశాన్ని పాలించాలన్న విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యంగబద్దంగా దేశాన్ని పాలించలేదని.. అలాంటిది, రాజ్యాంగ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసిందని సికింద్రాబాద్ ఎంపీ ఆరోపించారు.
Also Read: నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
మదర్ ఆఫ్ డెమొక్రసీ అంటే భారత్ అని మోదీ చెప్పారని ఆయన అన్నారు. అంబేద్కర్ జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆయన్ని అవమానించిందని చెప్పుకొచ్చారు. కుటుంబ పాలనకు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండి ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ఓ నిశబ్ద యుద్దమే జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!