BIG BREAKING: కేటీఆర్ పై మరో కేసు
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడడం, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడడం, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానని.. ఇందుకు అధికారులు సహకరించాలని ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. తిరుపతి ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో, పాలకమండలి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.
ఏపీలో ఇంటర్ ఫస్ట ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ అంశంపై స్పందించింది. పరీక్షల రద్దు వార్త అవాస్తవమని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయమై ఎలాంటి అపోహలకు గురి కావొద్దని స్పష్టం చేసింది.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో ఓ మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రభుత్వం స్థలం కేటాయించింది. 2020 ఆగస్ట్ 31న ఆయన మరణించిన విషయం తెలిసిందే. రాజ్ ఘాట్ లోపల ఆయన పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫున ఆయన లీగల్ టీం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, ఎప్పటికైనా బయటపడాల్సిందేనన్నారు.
ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు.