రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి

నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. జనవరి 28న షరతులతో దీక్ష జరుపుకోవచ్చని చెప్పింది. 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్‌ భావించిన సంగతి తెలిసిందే. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ హైకోర్టుకు వెళ్లింది.

New Update
high court TG

high court TG Photograph: (high court TG)

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలనుకున్న రైతు దీక్షకు తెలంగాణ హైకోర్డు అనుమతి ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండలో రైతు దీక్ష పేరుతో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి ఆ ధర్నాకు పర్మిషన్ రాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

జనవరి 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్‌ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్‌ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు