🔴 Delhi Assembly Elections 2025 Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
కులగణన సర్వే మళ్లీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. 'మేము ఈ కులగణన తప్పు అంటున్నాం. సర్వేలో మాకు అనుమానాలున్నాయి. అన్యాయం జరిగితే బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం పుట్టుకొస్తుంది' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
తెలంగాణలో బీసీ జనాభా తగ్గలేదని.. పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా- 51 శాతం అన్నారు. 2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33 శాతంగా తేలిందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. 3ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినా కేసీఆర్ తమకేమీ పట్టనట్లే వ్యవహరించడం చర్చనీయాంశమైంది. వీటికంటే స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని APCC చీఫ్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే తేలిందన్నారు. ఏపీలో కులగణన రిపోర్ట్ ను జగన్ ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టిందన్నారు.
రేవంత్ సర్కాన్ ను కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ BJP ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కనీసం ఎమ్మెల్యేలుగా చూడకుండా పట్టించుకోని ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఇందుకు MIM సహాకారం కూడా తీసుకుంటామన్నారు.
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై తగ్గేదేలేదన్నారు. తన ఇంట్లో వైఎస్సార్ పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నచ్చిన నేతల ఫొటోలను పెట్టుకుంటే తప్పేంటన్నారు.
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రం తిప్పారు. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే మున్సిపల్ వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.