TG News: మళ్లీ కులగణన సర్వే.. తలసాని సంచలన డిమాండ్!

కులగణన సర్వే మళ్లీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. 'మేము ఈ కులగణన తప్పు అంటున్నాం. సర్వేలో మాకు అనుమానాలున్నాయి. అన్యాయం జరిగితే బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం పుట్టుకొస్తుంది' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

New Update
telangana cm

CM Revanth reddy, BRS MLA Thalasani Srinivas yadav

TG News: రాష్ట్రంలో మళ్లీ కులగణన సర్వే చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కులగణన సర్వే నివేదికలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారనే వివరాలను పొందుపరచలేదని అన్నారు. చివరికి ముఖ్యమంత్రి కూడా తన స్టేట్‌మెంట్‌లో ఎవరు ఎంతమంది ఉన్నారో వెల్లడించలేదని, కాబట్టి సర్వేను మరోసారి నిర్వహించాలన్నారు.

30శాతం కూడా సర్వే చేయలేదు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30శాతం కూడా కులగణన సర్వే చేయలేదని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని బీసీలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం సర్వే చేయించి, తీర్మానం చేస్తే సరిపోదు. ఫార్మాట్‌ మార్చి మళ్లీ కులగణన సర్వే చేయించాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందేనని తన అభిప్రాయం వెల్లడించారు. 

అలాగే కామారెడ్డి డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయడం కోసం మన సమాజం ఎదురు చూస్తోందని ఈ సందర్భంతా తలసాని గుర్తు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి అడిగిన వెంటనే స్పీకర్‌ సభను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాధాన్యత గల అంశాలపై 4 రోజులు చర్చ లేకుండా ఒక్క రోజులోనే ముగించడమేంటని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: నిమిషాల్లోనే అమ్ముడుపోయిన భారత మ్యాచ్ టికెట్స్.. 25 వేలకు లక్షా యాభై వేలు!

బాధ్యతా రహితంగా, అన్యాయంగా, కుట్ర పూరితంగా వ్యవహరించడాన్ని తాము సహించమని అన్నారు. ఇప్పటికైనా 4 రోజుల పాటు చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. మేము కులగణన తప్పు అంటున్నాం. అదెలా కరెక్ట్‌ అవుతుందో ప్రభుత్వం నిరూపించుకోవాలి. సర్వేలో మాకు అనుమానాలున్నాయి. అవి నివృత్తి కావాలి. అన్యాయం జరిగితే బీసీల ఐక్యతతో అతిపెద్ద ఉద్యమం వస్తుందని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు