YS Sharmila: ఆ విషయంలో జగనన్న ఫెయిల్.. రేవంత్ సక్సెస్.. షర్మిల మరో సంచలన ట్వీట్!

రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని APCC చీఫ్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే తేలిందన్నారు. ఏపీలో కులగణన రిపోర్ట్ ను జగన్ ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టిందన్నారు.

New Update
YS Sharmila Revanth reddy

YS Sharmila Revanth reddy

తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొనియాడారు. ఇదో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమన్నారు. ఏపీలో సైతం ఇదే పరిస్థితు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణన చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో రేవంత్ సంచలన ప్రకటన

ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలన్నారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలన్నారు. మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాల్సిందేనననారు. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలన్న అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: AP Schools: ప్రైవేటు స్కూళ్లపై లోకేష్ సంచలన నిర్ణయం.. అధికారులతో కీలక భేటీ!

బీజేపీ డైరెక్షన్ లో సర్వేను తొక్కిపెట్టిన జగన్..

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారన్నారు. లెక్కలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని ఆరోపించారు. 

ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు షర్మిల. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు