/rtv/media/media_files/2025/02/03/UuCUpSRyDOFvP76jbJx6.jpg)
balakrishna Photograph: (baklakrishna)
Balakrishna: హిందూపురం నియోజక వర్గంలో మరోసారి ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రం తిప్పారు. ఆయన ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపాలిటీని(Hindupuram Municipal Elections) టీడీపీ(TDP) కైవసం చేసుకోగా మున్సిపల్ ఛైర్మన్(Municipal Chairman)గా 6వార్డు కౌన్సిలర్ రమేశ్( Councillor Ramesh) ఎన్నికయ్యారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతు లభించగా రమేశ్ ఎంపికయ్యారు. వైసీసీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు పడ్డాయి. ఇక ఈ ఓటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొనగా 3 సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆశీర్వాదాలు అందుకున్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ రమేష్✌️#PadmabhushanNBK #HindupurMLA pic.twitter.com/UWUeuonAtS
— Ꮇᴏʜᴀɴ🦁NBK✌️ (@CBNBK6) February 3, 2025
డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవం..
మరోవైపు ఏలూరు డిప్యూటీ మేయర్లు(Deputy Mayors) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదట డిప్యూటీ మేయర్‌గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా రెండో డిప్యూటీ మేయర్‌గా దుర్గాభవాని(Durga Bhavani) కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. దీంతో ఏలూరును టీడీపీ కైవసం చేసున్నట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరులోనూ టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. తమసీన్ కు 41 ఓట్లు పడగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు మాత్రమే వేశారు. తహసీన్ ఎన్నికకు సహకరించిన కార్పొరేటర్లకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: TDP MLA Adimulam Issue: 50 మహిళలు, కాలేజీ అమ్మాయిలతో ఎమ్మెల్యే రాసలీలలు.. సీఎంకు సంచలన లేఖ!
బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే..
నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే మున్సిపల్ వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. మొదట వైస్ ఛైర్మన్‌గా 9వ వార్డు ఎరటపల్లి శివకుమార్‌రెడ్డి, రెండో వైస్‌ఛైర్మన్‌గా 8వ వార్డుకు చెందిన పటాన్ నస్రిన్‌ను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇదిలా ఉంటే.. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, పిడుగురాళ్ల మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎన్నిక కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను కోరం లేనందున అధికారులు వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి వేసీపీ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక మంగళవారాని వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో స్పష్టం చేశారు.
Also Read: Bhumi Pednekar: అలా కూర్చొని.. భూమి ఇచ్చిన ఫోజ్‌కు కుర్రాళ్ల ఫ్యూజులౌట్!
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!