RTV Exclusive: ప్రభుత్వాన్ని పడగొడతాం.. నేను హోమంత్రిని కాబోతున్నా.. పైడి రాకేష్ రెడ్డి సంచలనం!

రేవంత్ సర్కాన్ ను కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ BJP ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కనీసం ఎమ్మెల్యేలుగా చూడకుండా పట్టించుకోని ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. ఇందుకు MIM సహాకారం కూడా తీసుకుంటామన్నారు.

author-image
By Nikhil
New Update
BJP MLA Paidi Rakesh Reddy

BJP MLA Paidi Rakesh Reddy

RTVతో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు MIM మద్దతు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బాంబ్ పేల్చారు.  ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని తాను స్వయంగా అక్రరుద్దీన్ ఓవైసీతో మాట్లాడతానన్నారు. తమను శాసనసభ్యులుగా గుర్తించకుండా అవమానించిన ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అన్ని పార్టీలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నామన్నారు.

నేనే హోంమంత్రి..

వాళ్ల దృష్టిలో తాము ఎమ్మెల్యేలు కానప్పుడు.. వాళ్లు కూడా తమకు మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకుని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి బరాబర్ ఈ ప్రభుత్వాన్ని కూల్చుతామని స్పష్టం చేశారు. అందరి మద్దతుతో ప్రజా ప్రభుత్వాన్ని, పార్టీలకు అతీతంగా ఉండే ఏర్పాటు చేస్తామన్నారు.  ఏర్పడే ప్రభుత్వంలో తాను హోం మంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ తోనే ఉందన్నారు. అవసరం అయితే అక్బరుద్దీన్ తో తాను వ్యక్తిగతందా మాట్లాడుతానన్నారు. న్యూట్రల్ గా ఉండాలని కోరుతానన్నారు.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు