/rtv/media/media_files/2025/02/04/TkKDw0VMATnR8W12xhtv.jpg)
Telangana CM Revanth Reddy
బీసీల జనాభా తగ్గించారంటూ బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్షాల నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా- 51 శాతం అని వెల్లడించారు. 2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33 శాతంగా తేలిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఓసీలు-21 శాతమన్నారు. ప్రస్తుత కులగణన సర్వే ప్రకారం ఓసీలు- 15 శాతమన్నారు. తాము బీసీల జనాభాను తగ్గించామని ఆరోపిస్తున్న వారు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు.
ఇది కూడా చదవండి: బీసీ కులగణన, SC వర్గీకరణ నివేదికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన రిపోర్టును సభలో చూపుతూ ప్రతిపక్షానికి ప్రశ్నలు గుప్పించారు రేవంత్. బీసీల లెక్కలు తగ్గాయని అంటున్న పార్టీలకు చెందిన వారిలో కొందరు అసలు సర్వేలోనే పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, డీకే అరుణ కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
— Telugu Galaxy (@Telugu_Galaxy) February 4, 2025
2014 లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం , బీసీల జనాభా- 51%
2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33%
బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఓసీలు-21%
ప్రస్తుత కులగణన సర్వే ప్రకారం ఓసీలు- 15%… pic.twitter.com/m8vdyapHld
42 శాతం సీట్లు ఇవ్వడానికి సిద్ధం..
భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ ఫ్యామిలీ సర్వేలో పాల్గొనలేదని పంచ్ లు విసిరారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అయితే నివేదికను ఎందుకు కేబినెట్ లో పెట్టలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీజేపీ, బీఆరెస్ పార్టీలు సైతం ఇందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.