తన ఇంట్లో వైఎస్సార్‌తో పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నచ్చిన నాయకుల ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఎవరి అభిమానం వాళ్లది అని.. ఫొటోలు పెట్టుకోవడం తప్పేం లేదని కామెంట్ చేశారు. తాను కాంప్రమైజ్ కాలేదని.. కాను కూడా అంటూ క్లారిటీ ఇచ్చారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు నాగేందర్. YSR సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదన్నారు. జైలుకు పోవడానికి కూడా సిద్ధమన్నారు. తనపై 173 కేసులు ఉన్నాయన్నారు. పేదల ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోనని.. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గనన్నారు.
ఇది కూడా చదవండి: Hydra Prajavani: హైడ్రా ప్రజావాణికి 71 ఫిర్యాదులు.. ఆ కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు!
గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ 2018 కన్నా ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఉండగానే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. అయితే.. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసులా మారిపోయారు.
ఇది కూడా చదవండి: BRS PRESIDENT KCR : కేసీఆర్ కు బిగ్ షాక్... లీగల్ నోటీసులు పంపిన లాయర్ ఎందుకో తెలుసా....
హైడ్రాపై మొదటి నుంచి ఫైర్..
ముఖ్యంగా హైడ్రాను వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నేరుగా మీడియా ముందే హైడ్రా చర్యలు సరిగా లేవంటూ కామెంట్లు చేశారు. హైడ్రా కూల్చివేతలను నేరుగా వెళ్లి అడ్డుకున్నారు కూడా. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రి పదవి దక్కకపోవడంతోనే దానం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. నాగేందర్ మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నార్న ప్రచారం కూడా కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫొటో మా ఇంట్లో ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారాయి.
Danam Vs Congress: రేవంత్‌కు షాకిచ్చిన దానం.. కేసీఆర్ ను పొగుడుతూ సంచలన కామెంట్స్!
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై తగ్గేదేలేదన్నారు. తన ఇంట్లో వైఎస్సార్ పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నచ్చిన నేతల ఫొటోలను పెట్టుకుంటే తప్పేంటన్నారు.
KCR And Revanth Reddy