Latest News In Telugu TG News: సీఎంతో కొత్త ఎమ్మెల్సీలు భేటీ- VIDEO ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరివెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తీరు మార్చుకోని అధికారులు.. ఎమ్మెల్యే సీరియస్ యాక్షన్..! లంచాలకు అలవాటుపడ్డ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా పని చేయాలని చెప్పినా వారు తీరు మార్చుకోకపోవడంతో స్వయంగా యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Crop Loan Waiver: తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్? తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చాలామంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికీ మాఫీ కాలేదని.. అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News : విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం! సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకోసం స్వయంగా సీఎం రేవంత్ రంగంలో దిగారు. మంగళవారం పలువురు నేతలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BIG BREAKING: పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. కేబినెట్ హోదాను సైతం కల్పించింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. జేసీ VS పెద్దారెడ్డి! అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత తాడిపత్రికి వచ్చారు. దీంతో టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేత కందిగోపుల మురళికి చెందిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రాపాలికి కీలక బాధ్యతలు! తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా ఛాహత్ బాజ్‌పేయ్ ను నియమించింది. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త..! గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు చెప్పారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: రాజకీయాల్లోకి వినేశ్ ఫోగాట్.. ఆ పార్టీనుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో!? భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వినేశ్‌కు తన సోదరి బబితా ఫోగాట్‌తో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn