/rtv/media/media_files/2025/02/03/h8JoTBuOJf9vPXETHL8t.webp)
BRS PRESIDENT KCR
KCR Meeting: బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఫామ్ హౌస్‌కే పరిమితమైన ఆయన ఇటీవల పార్టీ నాయకులు, కార్యకర్తలను ఫాంహౌస్‌లోనే కలుస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఫిబ్రవరి 19 నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అఫిషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టింది. ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ఆదేశించారు. ఆదేశాల మేరకు.. ఈనెల 19న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.
Also Read: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు... పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు.
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
ఫిబ్రవరి 19న ప్రత్యేక సమావేశం..
ఫిబ్రవరి 19న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నామని కేటీఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి పార్టీ నాయకులు ఖచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరగన్నదని ఎక్స్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల రావాలని ముఖ్యనాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: ఆపరేషన్ కగార్...100 మంది మహిళా మావోయిస్టులు హతం
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు