CM Revanth: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!
ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ బీసీ బిడ్డ కాదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, 2002 వరకు ఆయన ఉన్నత వర్గల్లోనే ఉన్నట్లు తెలిపారు. ఇందతా తాను అషామాషిగా చెప్పట్లేదని, అన్ని తెలసుకుని మాట్లాడుతున్నానన్నారు.
TG News: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ బీసీ బిడ్డ కాదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు. మోదీ 2002 వరకు ఆయన ఉన్నత వర్గల్లోనే ఉన్నట్లు తెలిపారు. ఇందతా తాను అషామాషిగా చెప్పట్లేదని, అన్ని తెలసుకుని మాట్లాడుతున్నానన్నారు.
మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ..
గాంధీ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. రాహుల్ గాంధీ మోదీ మెడలు వంచుతారనే కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. మోదీ బీసీ కాదు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. ఆయన బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలే. వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మేము ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దు. త్వరలోనే దీన్ని చట్టం చేయబోతున్నాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇండ్లముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్లను లైన్ లో పెట్టి లెక్కగట్టండి. కులగణనలో నమోదు చేయించుకోకపోతే కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే అత్యంత ప్రధానమైన రెండు కీలక అంశాలపై కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందన్నారు. కులగణనపై లేని అపోహలను సృష్టించి తప్పుల తడక అని చెప్పాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నిజం నిప్పులాంటింది. అది వారినే దహిస్తుంది తప్పా ప్రజలకు నష్టం కలిగించదు. మహాత్ముడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే శిలా శాసనం అని ఆనాడు తెలంగాణ ఏర్పాటుచేసి నిరూపించుకున్నారని చెప్పారు.
కులగణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్కగట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. సాంకేతికంగా, న్యాయ పరంగా కులగణనపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాం. 150 ఇండ్లను ఒక యూనిట్ గా చేసి ఎన్యుమరేటర్లను నియమించి కులగణన నిర్వహించాం. కులగణన ప్రకారం 56.33 శాతం బలహీనవర్గాల లెక్క తేలింది. చెట్ల మీద విస్తర్లు కట్టినట్టు కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కాకిలెక్కలు చూపించారు. ఆ లెక్కలు నిజమైతే 52 గా ఉన్న మాదిగ ఉపకులాలు కేసీఆర్ లెక్కపెడితే 82 ఎట్ల అయినయి అని ప్రశ్నించారు.
వాళ్లు పెద్ద గ్యాంబ్లర్స్. ఆ గ్యాంబ్లర్స్ కు ఇష్టం లేకనే సర్వేలో పాల్గొనలేదు. ప్రజలు అడిగి కడుగుతారని ఈ లెక్కలను గందరగోళం చేసి గంగలో కలపాలని చూస్తున్నారు. ఈ లెక్క నాకోసం చేయలేదు.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకుడిగా మా నాయకుడి ఆదేశాలను పాటించాను. త్యాగానికి సిద్ధమయ్యే ఈ లెక్కలను పక్కాగా చేయించాం. మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహించాం. కులగణనలో ఒక్క తప్పు లేదు వాళ్లు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేం తీసుకున్నాం. జనజీవన స్రవంతిలో కలవని వారికి కూడా మళ్లీ అవకాశం ఇచ్చాం. ఇది మా నిబద్ధతకు నిదర్శనం అన్నారు సీఎం రేవంత్.

CM Revanth Reddy shocking comments on Modi caste

ఇది కూడా చదవండి: Acid attack: చిత్తూరు యాసిడ్ దాడి ఘటన..15 నిమిషాల్లోనే నిందితుడు అరెస్ట్!
అలాగే అత్యంత ప్రధానమైన రెండు కీలక అంశాలపై కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందన్నారు. కులగణనపై లేని అపోహలను సృష్టించి తప్పుల తడక అని చెప్పాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నిజం నిప్పులాంటింది. అది వారినే దహిస్తుంది తప్పా ప్రజలకు నష్టం కలిగించదు. మహాత్ముడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. సోనియా గాంధీ మాట ఇస్తే శిలా శాసనం అని ఆనాడు తెలంగాణ ఏర్పాటుచేసి నిరూపించుకున్నారని చెప్పారు.
కులగణన చేసి బలహీన వర్గాల జనాభా లెక్కగట్టి వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సబ్ కమిటీ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. సాంకేతికంగా, న్యాయ పరంగా కులగణనపై నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాం. 150 ఇండ్లను ఒక యూనిట్ గా చేసి ఎన్యుమరేటర్లను నియమించి కులగణన నిర్వహించాం. కులగణన ప్రకారం 56.33 శాతం బలహీనవర్గాల లెక్క తేలింది. చెట్ల మీద విస్తర్లు కట్టినట్టు కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కాకిలెక్కలు చూపించారు. ఆ లెక్కలు నిజమైతే 52 గా ఉన్న మాదిగ ఉపకులాలు కేసీఆర్ లెక్కపెడితే 82 ఎట్ల అయినయి అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?