Ukraine: జెలెన్‌ స్కీ సంచలన ప్రకటన.. రష్యాతో ఆ మార్పిడికి సై అంటూ!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో భూభాగం మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రష్యా తమ దేశ భూభాగాలను వీడితే తమ అధీనంలో ఉన్నదాన్ని రష్యాకు అప్పగిస్తామని షరతు పెట్టారు. ఇందులో ట్రంప్ కలగజేసుకోవాలని కోరారు.

New Update
Ukraine zl

Ukraine zl Photograph: (Ukraine zl)

ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia) తో భూభాగం మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రష్యా తమ దేశ భూభాగాలను వీడితే తమ అధీనంలో ఉన్నదాన్ని రస్యాకు అప్పగిస్తామని షరతు పెట్టారు. ఇక ఉక్రెయిన్ భూ భాగాలన్నీ చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. అయితే అందులో ఎన్ని తీసుకోవాలనేదానిపై చర్చల తర్వాత వెల్లడిస్తామన్నారు. 

Also Read :  రోజాకు బిగ్ షాక్ ఇచ్చిన జగనన్న.. అక్కడి నుంచి ఔట్!

ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజ నిల్వలు..

ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన జెలెన్ స్కీ (Zelen Sky).. రష్యా, ఉక్రెయిన్ అనుకున్నది జరగాలంటే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమేయం తప్పనిసరి అన్నారు. అయితే ఈ సందర్భంగా అమెరికాకు చెందిన సంస్థలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని, అవి అమెరికాకు లాభాలు చేకూరుస్తాయని తెలిపారు. అమెరికా కంపెనీలు ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెడితో తమకు ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ఇక 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న డోనెస్క్‌, ఖేర్సన్‌, లుహాన్స్క్, జాపోరిజ్జియా తమ పూర్తి నియంత్రణలో లేవని చెప్పారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

యుద్ధం ఆపేస్తానంటున్న ట్రంప్..

ఇక మూడేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ కూడా తాను అమెరికా అధ్యక్షుడి పీఠం ఎక్కగానే ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు లేదా కాకపోవచ్చని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. రష్యా ఉక్రెయిన్‌లు ఒప్పందం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చని.. ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు, కాకపోవచ్చని ట్రంప్ అన్నారు. అలాగే ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల ఒప్పందంతో పాటు అరుదైన ఖనిజాల వినియోగం గురించి మాట్లాడారు. ఈ పోరాటాన్ని ఆపడం కోసం ప్రయత్నిస్తున్న తన రాయబారి అయిన కీత్‌ కెల్లాగ్‌ను త్వరలోనే కీవ్‌కు పంపించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ వచ్చేవారం జెలెన్‌స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. 

Also Read :  కాపాడండయ్య నన్ను.. సైబర్ క్రైమ్‎ను ఆశ్రయించిన పృథ్వీ!

Also Read :  స్వతంత్ర పోరాటంలో ఫ్రాన్స్ జ్ఞాపకాలను గుర్తు చేసిన మోదీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు