BOOK TREND: తెలుగు రాజకీయాల్లో ‘బుక్’ ట్రెండ్.. కలర్‌పుల్ బుక్స్ పేరుచెప్పి ప్రత్యర్థులకు వార్నింగ్

తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడినవారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్‌ల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు.

author-image
By K Mohan
New Update
political books in colors

political books in colors Photograph: (political books in colors)

BOOK TREND: బుక్స్.. బుక్స్.. బుక్స్, ఇవి పిల్లలు చదువుకునే బుక్స్ కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పగ తీర్చకునే పుస్తకాలు. అవునూ, శత్రువుల సంఖ్య పెరుగుతుంటే వారి పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం కదా మరి. ఇక పొలటికల్ లీడర్స్ విషయానికి వస్తే పాత కక్ష్యలు, పగలు, ప్రతీకారాలు అంటూ చాలామంది ప్రత్యర్థులుంటారు. అయితే వారికోసమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బుక్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థులను భయపెట్టడానికి ఒక్కో పార్టీ వారు ఒక్కో బుక్ మెయింటెన్ చేస్తున్నారు. అధికార పార్టీలు ఆ బుక్‌లను ఫాలో అవుతూనే పాలన నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. పాలిటిక్స్‌లో ఈ బుక్ ట్రెండ్ తీసుకొచ్చింది టీడీపీ నేత నారా లోకేష్.

లోకేష్ రెడ్ బుక్(Red Book) స్టోరీ

ఆంద్రప్రదేశ్‌లో అధికారులు వైఎస్‌ఆర్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న యువగళం పాదయాత్ర చేపట్టిన ప్రస్తుతం మంత్రి నాటి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ రెడ్‌బుక్‌ను బాగా వాడుకున్నారు. తన చేతిలో ఉన్న రెడ్ బుక్‌ను చూపిస్తూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వారి పేర్లు, కేడర్‌ను హింసించేవారి రాస్తున్నామని కచ్చితంగా ఇంతకు ఇంత చెల్లిస్తామని వారందరిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించేవాళ్లు. దానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. తర్వాత క్రమంలో రెడ్‌ బుక్ పేరు మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టారు. 2024 ఎన్నికల్లో దీన్నో ప్రచార అస్త్రంగా టీడీపీ వాడుకుంది. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఓ రెడ్‌బుక్ పట్టుకొని తిరిగారు. వేధింపులకు గురైన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు నారా లోకేష్ భరోసా ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. తర్వాత అక్రమాలకు పాల్పడిన కొందరు వైసీపీ నేతలు, అధికారులను అరెస్ట్ చేశారు. దీంతో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో రెడ్‌ బుక్ రాజ్యాంగం నడుస్తోందని రాజకీయ కక్ష్యలో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

Also Read:  ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

రెడ్‌బుక్‌పై వైసీపీ సెటైర్లు

అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ఆ రెడ్‌బుక్‌పై బాగా సెటైర్లు వేసింది. మతి మరుపు ఉన్న వ్యక్తి ఇలాంటి రాసుకుంటారని... లోకేష్‌కు అంత సీన్ లేదని విమర్శించింది. అధికారంలోకి వచ్చేది లేదు చేసేదేం లేదని కూడా ఎద్దేవా చేసింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి వైసీపీ పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు.

రెడ్‌బుక్‌పై వైసీపీ విమర్శలు

కాలం గిర్రున తిరిగింది. 2024లో వైసీపీ(YCP) అధికారం కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు రెడ్‌ బుక్‌ మాటను ఎన్నికల వరకు చెప్పిన టీడీపీ సైలెంట్ అయినా... వైసీపీ అందుకుంది. అంతే చేసిన ప్రతి పని వెనుక ఈ రెడ్ బుక్ ఉందంటూ ఆరోపిస్తోంది వైసీపీ. ఎవరిని అరెస్టు చేసినా, ఏ అధికారిని బదిలీ చేసినా, ఎవరిపై చర్యలు తీసుకున్నా దానికి రెడ్ బుక్‌ కారణమని విమర్శలు చేస్తూ వస్తోంది. 

ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్‌ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్‌

YSRCPకి రెండు బుక్స్ 

వైసీపీ రెడ్‌ బుక్‌(Red Book)పై ఆరోపణలు చేస్తూనే... కేడర్‌కు ధైర్యం చెప్పేందుకు కొత్త పంథాను ఎంచుకుంది వైసీపీ అధినాయకత్వం. అందుకే తరచూ ఆ పార్టీ నేతల నోట బుక్ ప్రస్తావన వచ్చేది. ఇప్పుడు ఏకంగా అధినేత జగన్ మోహన్ రెడ్డే తాము కూడా రెడ్‌బుక్ రాయడం మొదలు పెట్టామంటున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు చేసిన తప్పులను రెడ్‌బుక్‌లో నోట్ చేస్తామంటున్నారు. అంతే కాకుండా పార్టీ కోసం కష్టపడే లీడర్ల కోసం గుడ్ బుక్‌ కూడా రాస్తున్నామని జగన్ అన్నారు. 

గుడ్‌బుక్‌(Good Book), గ్రీన్ బుక్(Green Book)

వివిధ జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ ఈ బుక్స్‌పై స్పందించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని ఆరోపించిన ఆయన... కచ్చితంగా అన్నింటినీ, అందరి పేర్లను మా వాళ్లు నోట్ చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని చెప్పారు. రెడ్‌బుక్ మెయిటైన్ చేయడం పెద్ద కష్టం కాదని అందుకే రెండు పుస్తకాలు రాస్తున్నామన్నారు. రెడ్‌బుక్‌తోపాటు గుడ్ బుక్ ఉంటుందన్నారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గం నేతలతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నేను గ్రీన్ బుక్ రాయడం మొదటు పెట్టా, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు పేరు గ్రీన్ బుక్‌లో రాస్తా. అధికారంలోకి వచ్చాక గ్రీన్ బుక్‌లో ఉన్న ప్రతి కార్యకర్తకు మేలు చేస్తా అని చెప్పారు. 

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

తెలంగాణలో పింక్ బుక్(Pink Book)

బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders), కార్యకర్తలే టార్గెట్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్(Congress Government) పని చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)  ఆరోపించారు. అధికారం ఉందికదా అని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతుందని, అన్ని పింక్‌బుక్‌లో రాసుకుంటున్నామని.. తిరిగి అధికారంలోకి వస్తామని, వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసని.. మీ లెక్కలు తీస్తామన్నారు. జనగామలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో పింక్ బుక్ గురించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నె క్రిషాంక్ కూడా చెప్పారు.

ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్(Black Book)

బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో కక్ష్య రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. పొలిటికల్ పార్టీలకు కొమ్ముకాస్తూ అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పేర్లు బ్లాక్ బుక్‌లో రాసుకుంటున్నామని హుజూరాబాద్ ఎమ్మెల్యే హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తిగిరి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే మాటలు మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు