/rtv/media/media_files/2025/02/14/MII0lxeMJZYex3I0Q7pC.jpg)
Vallabhaneni Vamshi Kodali Nani
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వంశీ అరెస్ట్ అయినప్పటి నుంచి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెక్స్ట్ అరెస్ట్ నానిదే అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఈ ఇద్దరు నేతలు టీడీపీలోనే ఉన్నారు. అయితే.. 2014 ఎన్నికల కన్నా ముందు కొడాలి నాని వైసీపీలో చేరారు. వంశీ మాత్రం 2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పార్టీకి దూరమై వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు టీడీపీపై రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.
రెడు బుక్ లో నాని, వంశీ పేర్లు..
ముఖ్యంగా చంద్రబాబు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులు వీరి పేరు చెబితేనే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కొడాలి నాని, వల్లభనేని వంశీని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు. రెడ్‌బుక్‌లో మొదటి వరుసలో వంశీ, కొడాలి నాని పేర్లు ఉన్నాయన్న టాక్ కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి అరెస్ట్ ఖాయమన్న ప్రచారం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగుతోంది.
ఎన్నికల ఫలితాల తర్వాత వల్లభనేని వంశీ ఏపీలో ఎక్కడా పెద్దగా కనినించలేదు. అరెస్ట్ కు భయపడి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం కూడా సాగింది. ఓ దశంలో నల్గొండ సమీపంలో ఆయనను అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పుడు అలాంటిదేమీ జరగలేదు. తాజాగా పక్కా స్కెచ్ తో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు కిడ్నాప్ కేసుల కింద ఆయనను అరెస్ట్ చేశారు.
దీంతో వంశీ ఇప్పట్లో విడుదల కావడం కష్టం అన్న చర్చ సాగుతోంది. ఈ కేసులతో పాటు మరో 6 కేసులను ఆయనపై పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఒక వేళ ఇప్పుడు అరెస్ట్ అయిన కేసులో జైలు నుంచి విడుదలైనా మరో కేసులో అయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.