ఆంధ్రప్రదేశ్ AP Politics: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం! ఇటీవల విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు మరో కీలక పదవి దక్కనుంది. ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RRRపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష-VIDEO రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. భూసేకరణ సమస్యలు, అలైన్మెంట్ తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ ఎవరిది? జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే అని.. ఆయనే పిటిషన్ వేయించాడని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది తనది కాదని.. తన మిత్రుడిదని కేటీఆర్ ప్రకటించారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul gandhi: రోస్టర్ బెంచ్ ముందుకు రాహుల్ గాంధీపై పౌరసత్వ పిటిషన్! రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 26కు విచారణను వాయిదా వేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata case: రెడ్‌లైట్ ఏరియా నుంచి అభయ దగ్గరికి.. వెలుగులోకి సంజయ్ భయంకర దారుణాలు! అభయపై లైంగిక దాడి నిందితుడు సంజయ్ గురించి భయంకరనిజాలు బయటపడుతున్నాయి. పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తూ పెద్ద తలకాల అండతో దారుణాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. రెడ్ లైట్ ఏరియాతో సంబంధాలున్నాయని, ఆరోజు అక్కడినుంచి అభయ దగ్గరకు వచ్చి రేప్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ration shop: రేషన్ కార్డు దారులకు మోదీ శుభవార్త.. అందుబాటులోకి మరిన్ని సరుకులు! రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. పేదలకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ డీలర్ల ఆదాయం పెంచేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. నిత్యవసర సరుకుతోపాటు పాల ఉత్పత్తులు విక్రయించనున్నారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ! రుణమాఫీ కాని రైతుల కోసం రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసు, రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ketireddy pedda reddy: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు! తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తనను హత్య చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు రాజకీయంగా అడ్డొస్తాననే భయంతోనే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్! ఏపీలో ఫేక్ దివ్యాంగుల పెన్షన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn