/rtv/media/media_files/2025/02/17/1qr0E1wo7utfaPyOg7mw.jpg)
Bandi Sanjay KCR
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు 71వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు 'X' ఖాతాలో పోస్ట్ చేశారు. 'బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.@KCRBRSPresidentpic.twitter.com/IImbbhKOAi
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2025