Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. ఢిల్లీలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి,  పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు.

New Update
CM Revanth Delhi Tour

CM Revanth Delhi Tour

తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ కులగణనపై పూర్తిగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి వివరించానన్నారు. పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామన్నారు. తెలంగాణలో బహిరంగ సభ ఉంటుందని.. దానికి రావాలని రాహుల్ గాంధీని కోరానన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలను ఫాలో అయ్యాననన్నారు. తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్ అని అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాజకీయ కోణంలో కాదు.. ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని స్పష్టం చేశారు. ప్రజలను ఉద్రేక పరిచే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

Also Read :  సమాధులను తవ్వి...అన్నవరంలో రెచ్చి పోతున్న మట్టి మాఫియా

Also Read :  ప్లీజ్ నన్ను వదిలేయండి.. సింగర్ మంగ్లీ ఎమోషనల్ !

లెక్క తప్పలేదు..

కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే, కేటీఆర్ ఏదేదో చెబుతున్నాడన్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానిని కించపరిచేలా తాను మాట్లాడలేదన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పానన్నారు. బీజేపీ నేతలు సైతం అదే విషయాన్ని ధృవీకరించారన్నారు. తాను చెప్పింది ఒప్పుకుంటున్నారన్నారు. 

Also Read :  జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం

తనను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున ప్రజలకు హామీ ఇచ్చింది తానని.. అవి అమలు చెయ్యక పోతే అడిగేది కూడా తననే అన్నారు. కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి,  పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. కేబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. 

Also Read :  మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు