Satyapal Malik: మాజీ గవర్నర్ కన్నుమూత
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.