Viral Video: దెయ్యాలతో ఆటాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్.. BJP విమర్శలు

RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనవరాళ్లతో కలిసి 'హలోవీన్' సెలబ్రేషన్స్ జరుపుకోవడం రాజకీయ దుమారం రేపింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు రోహిణి ఆచార్య ఈ వేడుకల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, BJP తీవ్రంగా స్పందించింది.

New Update
Lalu Yadav's Halloween Fest

బిహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections 2025) నేపథ్యంలో RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన మనవరాళ్లతో కలిసి 'హలోవీన్' సెలబ్రేషన్స్(Lalu Yadav Halloween Fest) జరుపుకోవడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు రోహిణి ఆచార్య ఈ వేడుకల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది.

లాలూ యాదవ్(lalu-prasad-yadav) విదేశీ సంస్కృతికి చెందిన హలోవీన్ వేడుకల్లో పాల్గొనడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా గతంలో ఆయన చేసిన ఓ వివాదాస్పద వ్యాఖ్యను బీజేపీ మళ్లీ తెరపైకి తెచ్చింది. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ పవిత్రమైన హిందూ పండుగ అయిన 'మహా కుంభమేళా'ను 'ఫాల్తూ' (అనవసరం) అని వ్యాఖ్యానించారు.

బీజేపీ కిసాన్ మోర్చా ట్విట్టర్/ఎక్స్ వేదికగా లాలూ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుంది. "బిహార్ ప్రజలారా, మర్చిపోవద్దు. విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కుంభమేళాను 'ఫాల్తూ' అన్నది ఇదే లాలూ యాదవ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్రిటిష్ పండుగ అయిన హలోవీన్‌ను జరుపుకుంటున్నారు. మతాన్ని కించపరిచే వారికి బిహార్ ప్రజలు ఓటు వేయరు" అని ఘాటుగా విమర్శించింది.

Also Read :  దెయ్యాలతో ఆటాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్.. BJP విమర్శలు

'ఫాల్తూ' వ్యాఖ్యతో వివాదం

గతంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీపై స్పందిస్తూ లాలూ యాదవ్ ఆ వ్యాఖ్యలు చేశారు. "కుంభ్‌తో పనేముంది? అది ఫాల్తూ" అని ఆయన అనడం అప్పట్లో పెను రాజకీయ దుమారాన్ని సృష్టించింది. హిందూ మత మనోభావాలను లాలూ కించపరిచారని బీజేపీ మరియు హిందూ మత పెద్దలు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా, హలోవీన్ వేడుకల వీడియోలతో, లాలూ యాదవ్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, విదేశీ సంస్కృతికి అనుకూలంగా ఉన్నారంటూ బీజేపీ మరోసారి రాజకీయ దాడికి దిగింది. మనవరాళ్లు దెయ్యాలు, ఇతర పాత్రల వేషధారణలో ఉన్నప్పటికీ, లాలూ యాదవ్ మాత్రం సంప్రదాయ కుర్తా-పైజామాలో నవ్వుతూ కనిపించారు.

ఈ ఘటనతో, లాలూ కుటుంబ వేడుకలు బిహార్ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. మత విశ్వాసాలు, సంస్కృతి విషయంలో ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు సంధించడానికి బీజేపీకి ఇది మరో అవకాశం కల్పించినట్లయింది.

Also Read :  IAS కోచింగ్ సెంటర్లకు రూ.8 లక్షల జరిమానా

Advertisment
తాజా కథనాలు