Viral Video: డిప్యూటీ సీఎంపై చెప్పులు, పేడ విసిరిన ప్రజలు.. వీడియో వైరల్!

లఖిసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. తన కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ వంటివి విసిరారు. అక్కడితో ఆగకుండా రాళ్లతో కూడా దాడి చేశారని విజయ్ కుమార్ తెలిపారు.

New Update
deputy cm vijay sinha

deputy cm vijay sinha

ప్రస్తుతం బిహార్‌(bihar)లో పోలింగ్(polling) జరుగుతోంది. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో లఖిసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. తన కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ వంటివి విసిరారు. అక్కడితో ఆగకుండా రాళ్లతో కూడా దాడి చేశారని విజయ్ కుమార్ తెలిపారు. అలాగే ఓ పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ కార్యకర్తలు ప్రయత్నించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

ఇది కూడా చూడండి: Viral Video: దెయ్యాలతో ఆటాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్.. BJP విమర్శలు

ప్రతి ఒక్కరూ ఓట్లు వినియోగించుకోవాలని..

ఈ విషయంపై అక్కడ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని వెల్లడించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు. అదే నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం విజయ్ సిన్హా ఓటు వినియోగించుకున్నారు. అందరూ కూడా ఓటు వేయాలని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Bihar Elections : ప్రశాంతంగా బిహార్‌ మొదటి దశ పోలింగ్..ఓటేసిన నితీష్

Advertisment
తాజా కథనాలు