Jubilee Hills Bye-Election: భారీగా నామినేషన్ల ఉప సంహరణ.. జూబ్లీహిల్స్ పోటీలో మిగిలింది వీళ్లే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 81 మందిలో 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

New Update
Jubilee hills by election

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. నిన్న స్క్రూటినీ తర్వాత మొత్తం 81 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. అయితే నేడు వారిలో 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో వీరిలో గుర్తింపు పొందన, రిజస్టర్డ్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు వారి పార్టీ గుర్తులు కేటాయిస్తారు. మిగతా వారికి ఇతర గుర్తులను ఈ రోజు సాయంత్రంలోగా కేటాయించనుంది ఈసీ. సాధారణంగా ఒక్కో బ్యాలెట్ యూనిట్ లో 16 మంది అభ్యర్థుల పేర్లు గుర్తులు ఉంటాయి. ప్రస్తుతం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో నాలుగు ఈవీఎం బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇది కాస్త టెన్షన్ పెట్టించే అంశంగా చెప్పొచ్చు. వృద్ధులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్ల దాఖలు, విత్ డ్రా ముగియడంతో అభ్యర్థులు ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నారు. వచ్చే నెల 11న ఈ ఎన్నికలు జరగనుండగా.. 9వ తేదీ సాయంత్రం వరకే ప్రచారానికి అవకాశం ఉంటుంది. 14న ఫలితాలను విడుదల చేయనున్నారు. 

ప్రధాన పార్టీలకు సవాల్..

ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తమ బలం ఏమాత్రమ తగ్గలేదని అధికార కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రచారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం రోడ్ షోలు, మీటింగ్ లు నిర్వహించే ఛాన్స్ ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం సిట్టింగ్ సీటును మరో సారి దక్కించుకుని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చాటాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను క్షేత్ర స్థాయిలో మోహరించి పక్కా ప్లాన్ తో ప్రచారం చేస్తోంది కారు పార్టీ. 

ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి దూకుడు మీద ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గం తన ఎంపీ స్థానం పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థి ఎంపిక నుంచి.. ప్రచారం వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ సీటులో విజయం సాధించి.. భవిష్యత్ లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనన్న సంకేతాలు ఇవ్వాలన్న లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు పని చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు