/rtv/media/media_files/2025/01/27/GdOkgNupKTnOvSAxrEG1.webp)
Jai Bapu Jai bheem
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరివెళ్లారు. ఇండోర్ జిల్లా మోవ్‌లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో పాల్గొంటారు. మోవ్‌లోని వెటర్నరీ గ్రౌండ్ లో ఏఐసీసీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తిరిగి రాత్రి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
CM Revanth Reddy To Visit Madhya Pradesh
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) డాక్టర్ అంబేద్కర్‌ను అగౌరవపరిచారని ఆరోపిస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) డిమాండ్ చేస్తోంది. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ మోవ్‌లోని డాక్టర్ అంబేద్కర్ జన్మస్థలం వద్ద జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ అనుచరులు పెద్ద ఎత్తున తరలివస్తారని కాంగ్రెస్ చెబుతోంది.ఆర్‌ఎస్‌ఎస్, మోడీ (PM Modi) ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఇది వేదికగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నదని, దీన్ని భారత ప్రజలు ఎప్పటికీ సహించరని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ వారి ఎజెండాకు తగినట్లు రాజ్యాంగాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవాలనుకుంటోది. కానీ ఇప్పుడు, 400 సీట్లు దాటాలనే వారి నినాదం 240కి తగ్గడంతో రాజ్యాంగాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రయోజనాలకు ద్రోహం చేస్తుందని, అణగారిన వర్గాల హక్కులపై దాడి చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలు అవమానాలకు గురవుతున్నాయని పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ సభ్యులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు.
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
ఇది కూడా చూడండి: Mauni Amavasya: మౌని అమావస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు