/rtv/media/media_files/2025/02/13/p8LyZ8NlWwqD0uzg5zyk.jpg)
narasihareddy
TS News: సిద్దిపేట జిల్లాలో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దుబ్బాక తహశీల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మన్యం నర్సింహారెడ్డి లక్ష రూపాయలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలోని 257, 259, 266, 275, 287 సర్వే నెంబర్లలో రాజిరెడ్డి చనిపోయిన తర్వాత భార్య కుంభం సుజాత పేరు మీద పట్టా భూమిని వారసత్వంగా పొందడం కోసం లంచం డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ముల్లంగి రసం పైల్స్‌కి మంచిదా.. వైద్యులు ఏమంటున్నారు?
ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ..
అప్పనపల్లి గ్రామంలోని లక్ష్మీ టీ పాయింట్ దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నర్సింహారెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులు సిద్దిపేటలోని నర్సింహారెడ్డి నివాసంతో పాటు తహశీల్దార్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ACB టోల్ ఫ్రీ నంబర్-1064ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫిర్యాదు దారు, బాధితుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతామంటున్నారు.
ఇది కూడా చదవండి: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!