Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

కన్నడ స్టార్ సుదీప్ కిచ్చా హైద్రాబాద్ మెట్రోలో సందడి చేశారు. CCL మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన మెట్రోలో ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లో సిబ్బందితో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
sudeep in Hyderabad metro

Kiccha Sudeep in Hyderabad metro

Kiccha Sudeep:  కన్నడ స్టార్(Kannada Star) హీరో కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రో స్టేషన్(Hyderabad Metro Station) లో సందడి చేశారు. సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచుల కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన మెట్రోలో ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లో తన టీమ్ అలాగే మెట్రో సిబ్బందితో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను హైదరాబాద్ మెట్రో సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేశారు. 

Also Read :  రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

 CCL మ్యాచ్‌లు

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంతో రెండు రోజుల పాటు CCL మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ హైదరాబాద్ కి చేరుకుంది. ఇందులో భాగంగా ఉప్పల్ స్డేడియం వెళ్లేందుకు సుదీప్ మెట్రోలో ప్రయాణించారు.  కిచ్చా సుదీప్ బుల్డోజర్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14న చెన్నై రైనోస్‌- బుల్డోజర్స్ తలపడనున్నాయి. మరో మ్యాచ్ లో తెలుగు వారియర్స్- భోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 2న జరగనుంది. సుదీప్ కిచ్చా 'ఈగ' తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన్నారు. 

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

బిగ్ బాస్ కి గుడ్ బై.. 

ఇది ఇలా ఉంటే  బిగ్గెస్ట్ రియాలిటీ షో  కన్నడ  బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుదీప్ ఇటీవలే షోకు గుడ్ బై చెప్పారు. ఇకపై సీజన్స్ తాను హోస్ట్ చేయడంలేదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. గత 13 సీజన్లుగా సుదీప్ ఈ షోను హోస్ట్ చేయడం విశేషం. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు