/rtv/media/media_files/2025/02/13/ISYrE2N6VW8YmnR3ZPPf.jpg)
a8c23716-ff75-442a-a988-f1189bc8cf9d
Veera Raghava Reddy: చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో పోలీసులు ప్రధాన నిందితుడైన కొవ్వూరి వీర రాఘవరెడ్డి(45)తో పాటుగా మరో ఐదుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితుడు వీరరాఘవరెడ్డి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తి మండలం కొప్పవరంలో RTV గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
కొవ్వూరి వీరరాఘవరెడ్డి వృత్తిరీత్యా సంగీతం టీచర్. తండ్రి స్థానిక పోగాకు పరిశ్రమలో రిటైర్డ్ కార్మికుడు, తల్లి హౌస్ వైఫ్. 15 ఏళ్ల వయస్సులో స్వగ్రామం వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిన రాఘవరెడ్డి.. పోలీసులు, కోర్టులు ధర్మస్థాపన కోసం పనిచేయడం లేదని, రామరాజ్యం స్థాపన కోసం ప్రత్యేకంగా ఓ సంస్థ ఉండాలని భావించేవాడు. తానో ముక్కంటి అవతారంగా ఊహించుకుని 20 మందికిపైగా అనుచరులను కూడా నియమించుకున్నాడు. 2020లో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో రామరాజ్యం పేరుతో ఛానెళ్లును ఏర్పాటు చేసి ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
10 నెలల క్రితమే రంగరాజన్‌తో
2022లో కోసలేంద్ర ట్రస్టు పేరిట ఎన్జీవోను కూడా ఏర్పాటు చేశాడు. ఎన్జీవోకు ఛైర్మన్‌గా తన భార్యను నియమించాడు వీరరాఘవరెడ్డి. ఓ బ్యాంకు ఖాతా ద్వారా విరాళాలు స్వీకరించేందుకు పేమెంట్ గేట్‌వేతో ఒప్పందం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ఆలయాల ప్రధాన పూజారులను కలిసి..తన సిద్ధాంతానికి మద్దతివ్వాలని కోరేవాడు వీరరాఘవరెడ్డి. అందులో భాగంగానే 10 నెలల క్రితమే రంగరాజన్‌తో చిలుకూరులో రాఘవరెడ్డి సమావేశం అయ్యాడు. రామదండు ఏర్పాటుకు మద్దతివ్వాలని రంగరాజన్‌ను కోరాడు. అందుకు రంగరాజన్ స్పందించకపోవడంతో మనసులో పెట్టుకుని ఆయనపై తాజాగా దాడికి దిగాడు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారిని అంతమొందించాలని వీరరాఘవరెడ్డి తన అనుచరులతో ప్రతిజ్ఞ చేయించినట్లు మొయినాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా వీరరాఘవరెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
Also Read : MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!