Salaar Movie: టాలీవుడ్ ను షేక్ చేయబోతున్న క్రేజీ కాంబినేషన్?...ప్రశాంత్ నీల్ మాములోడు కాదుగా

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్. సెప్టెంబర్ 28 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెండర్ కు వాయిదా పడింది. క్రిస్టమస్ కానుక గా వస్తున్న ఈమూవీలో డైరెక్టర్ సినీ ప్రియులకు అదిరిపోయే షాక్ ఇవ్వనున్నారుట. దీనికి సంబంధించిన రూమర్ ఒకటి సినీ సర్కిల్ లో తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా....అయితే దీని మీద ఓ లుక్కేసేయండి.

Salaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే
New Update

Salaar Movie: ప్రభాస్ (Prabhas) లో ఉన్న వయెలెంట్ యాంగిల్ మొత్తాన్ని పిండి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సలార్ మూవీ అని అంచనా. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ (KGF) ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైరెక్టర్ ప్రభాస్ తో మూవీ తీస్తున్నాడు అనేసరికి అంచనాలు ఆకాశాన్ని దాటాయి. దానికి తగ్గట్టే మూవీ టీమ్ రిలీజ్ చేసిన టీజర్ కూడా దుమ్ములేపింది. ప్రభాస్‌ను క్లియర్ గా చూపించకపోయినప్పటికీ అతని క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ తో టీజర్ మోత మోగింది. 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసింది. దీన్ని బట్టి అర్ధంచేసుకోవచ్చు సలార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.ప్రశాంత్ నీల్ (Prashanth Neel) క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ ను డైనోసార్ తో పోలుస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ మీద వచ్చిన రూమర్ తో ఈ క్రేజ్ మరింత పెరిగిపోయింది. సలార్ లో ప్రభాస్ తో పాటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ (NTR), కేజీఎఫ్ హీరో యశ్ (Yash) కూడా నటించారుట. క్లైమాక్స్ లో వీళ్ళిద్దరూ కనిపిస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. దీని మీద మూవీ టీమ్ ఏమీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ఇది నిజమైతే మాత్రం థియేట్లర్లు మోత మోగిపోతాయని అంటున్నారు. దీన్ని నిజం గానీ చేస్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్కెచ్ ఓ లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు.

నిజమే అవ్వొచ్చు...

సలార్ లో ఎన్టీయర్, యశ్ నటించిన మాట నిజమే అవ్వొచ్చని అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే దేవర, వార్ సినిమాల తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు.అలాగే యశ్ లో కేజీఎఫ్-3 ఉంటుందని ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. ఈనేపథ్యంలో సలార్ సినిమాలో వీళ్ళిద్దరూ కనిపించొచ్చని చెబుతున్నారు. ఆ కారణాల వల్లనే ఎన్టీయార్, యశ్ లు గెస్ట్ రోల్ ప్లే చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ముగ్గురు పెద్ద హీరోలు నటించిన భారీ చిత్రం సలార్ అవుతుందని చెబుతున్నారు.

ఇక దీంతో పాటూ సలార్ గురించి మరో రూమర్ కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇది పాత రూమరే అయినప్పటికీ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు తీసిన ఉగ్రం (Ugramm) సినిమాకు సలార్ రీమేక్ అనే వాదన వినిపిస్తోంది. గతంలో ఇలాగేరూమర్లు వచ్చినప్పుడు ప్రశాంత్ నీల్ వాటిని కొట్టిపడేశాడు. ఉగ్రం షేడ్స్ సలార్ లో కనిపించొచ్చు కానీ అది రీమేక్ కాదని తలే్చి చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అవే రూమర్లను తెర మీదకు తీసుకువస్తున్నారు. దీనికి కారణం ఉగ్రం సినిమాను యుట్యూబ్ నుంచి తొలగించడమే అని చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయితే కానీ నిజానిజాలు తెలియవు అంటున్నారు మరి కొందరు నెటిజన్లు.

Also read:శ్రీదేవిది సహజ మరణం కాదు- ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ కపూర్

#telugu #salaar #ntr #prabhas #prasanth-neel #hero-yash #movies #salaar-movie #yash
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe