Boney Kapoor Reveals about Sridevi’s death: ప్రముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ చాలా విషయాల్ని మాట్లాడారు. తన భార్య శ్రీదేవి మరణం విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఇది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణం. నేను దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను.. ఎందుకంటే నేను దర్యాప్తు విచారణలో దాదాపు 24 లేదా 48 గంటల పాటు దాని గురించి మాట్లాడాను. అందుకే తరువాత ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు అని చెప్పుకొచ్చారు బోనీ కపూర్. భారతీయ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉన్నందువల్లనే విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారు. అయితే చివరకు తాను చేసిందేమీ లేదని శ్రీదేవి ప్రమాదవశాత్తు మాత్రమే చనిపోయిందని తేల్చారని బోనీ అన్నారు.
పూర్తిగా చదవండి..Sridevi death:శ్రీదేవిది సహజ మరణం కాదు- ఎట్టకేలకు నోరు విప్పిన బోనీ కపూర్
అందాల తార, జగదేక సుందరి శ్రీదేవి హఠటాత్తుగా మరణించడం అందరినీ తీవ్రంగా కలిచేసింది. ఆమె అకాల మరణం వినోద పరిశ్రమనే కాకుండా యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అనూహ్యంగా శ్రీదేవి చనిపోవడం, అది కూడా అసహజంగా అవడంతో ఆమె మరణం మీద చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను కూడా అనుమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి మౌనంగా ఉంటూన్న బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య మరణం గురించి నోరు విప్పారు. తనది సహజమరణం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: