movies:భారీ ధరకు అమ్ముడబోయిన దేవర డిజిటల్ రైట్స్ జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర. సుమారు 300 కోట్ల వరకు ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఇండియన్ భాషలలో ఈ మూవీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగాదీని డిజిటల్ రైట్లు అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. By Manogna alamuru 29 Sep 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆర్ఆర్ఆర్ తర్వాత జూ.ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. ఇందులో పాత్రల లుక్ ను రివీల్ చేసి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయడంలో దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దేవర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నవంబర్ ఆఖరుకి దేవర సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కొరటాల శివ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. హై వోల్టేజ్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై కొరటాల శివ ఆవిష్కరించే పనిలో ఉన్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ సైతం ఈ సినిమాకి వర్క్ చేయడం విశేషం. సముద్రం బ్యాక్ డ్రాప్ లో దేవర సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దేవర మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ దేవర మూవీ డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకి సంబంధించి సొంతం చేసుకుంది. 150 కోట్లకి నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల దేవర మూవీ షూటింగ్ కంప్లీట్ కాకుండా పెట్టిన పెట్టుబడిలో 50 శాతం రికవరీ అయ్యిందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకి ఓటీటీ కంపెనీల నుంచి అదిరిపోయే ఆఫర్స్ డిజిటల్ హక్కుల కోసం వస్తున్నాయి. అందుకే స్టార్స్ తో సినిమాలు చేసే నిర్మాతలు భారీ బడ్జెట్ తో మూవీస్ చేస్తోన్న కూడా సేఫ్ జోన్ లో ఉంటున్నారు. దేవర తర్వాత ఎన్టీయార్ హిందీలో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటుస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త మూవీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది. ఇది కూడా చదవండి:45 కోట్ల ఏళ్ళ చేప…ఇప్పటికీ జీవించే ఉన్నాయి. సలార్ రిలీజ్ డేట్ చెప్పేశారు…ఎక్స్ లో ట్రెండింగ్ లో సీజ్‌ఫైర్. #telugu #price #rites #movies #netflix #pan-india #digital #jr-ntr #koratala-siva #devara #high మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి