Screen time:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?
పిల్లలు పెంపకం....ఇదో అంతులేని సబ్జెక్ట్. దీని గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతీ పిల్లా, పిల్లాడికి తేడాలు ఉన్నట్లే ప్రతీ తల్లిదండ్రుల పెపంకంలోనూ తేడా ఉంటుంది. పిల్లలు ఇంతకు మునుపులా లేరు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ పిల్లల తెలివితేటల్లో మార్పులు వస్తున్నాయి. 80, 90 లలో పిల్లలు అమ్మానాన్న ఎలా చెబితే అలా వినేవారు. తిరిగి ప్రశ్నించడం చాలా అరుదుగానే ఉండేది. కానీ తర్వాత తరం మాత్రం ప్రశ్నించడమే జన్మహక్కుగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం డిజిటలైజ్ అయిపోవడంతో దానికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దీని నుంచి వారిని ఎలా కాపాడాలన్నదే ఇప్పుడు పేరెంట్స్ ముఖ్య సమస్య.