దేశంలోనే ఖరీదైన మామిడి.. ఒక్కో పండు ధర రూ.10 వేలు
అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండును మహారాష్ట్రలోకి చెందిన ఓ మహిళ సాగు చేసింది. దీన్ని వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించగా ఒక్కోక్కటి రూ.10 వేల ధర పలికింది. జపాన్ నుంచి మొక్కలు తీసుకొచ్చి ఈ మామిడి సాగును రెండేళ్ల క్రితం చేపట్టగా ఇప్పుడు కాపుకొచ్చింది.