CPI MP Viswam: అదానీ, అంబానీపై ఈడీ విచారణ జరిపించండి.. మోదీకి ఎంపీ బినోయ్ విశ్వం లేఖ
అదానీ, అంబానీ అక్రమాలపై విచారణ జరిపి వారి నుంచి నల్లధనాన్ని వెలికితీయాలని కోరుతూ సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికను లేఖలో ప్రస్తావించారు. వెంటనే వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.