Bhopal: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భోపాల్‌కు చెందిన బీజేపీ నేత వినయ్ మెహర్ అత్యుత్సాహం చూపించాడు. మంగళవారం ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్‌లోకి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లి ఓటు వేయించాడు. అంతేకాదు దీనిని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ వినయ్ పై విచారణకు ఆదేశించారు. పోలింగ్ బూత్ వద్ద ప్రిసైడింగ్ అధికారి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
In Bhopal, a BJP leader and his minor son are playing with EVMs.
In Bhopal, BJP's distric Panchayat member Vinay Mehar made his minor son cast his vote. Vinay Mehar also made a video of the casting of the vote. Vinay Mehar posted the video on Facebook.
Will any action be taken?… pic.twitter.com/J4oO7woGWs
— I-N-D-I-A (@_INDIAAlliance) May 9, 2024
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ చర్యకు పాల్పడ్డాడు వినయ్ మెహర్. అయితే 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బీజేపీ నాయకుడి ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్లు సమాచారం. కాగా బూత్‌లో ఉన్న బాలుడు, తండ్రి కమలం చిహ్నంతో లింక్ చేయబడిన EVM పై బటన్‌ను నొక్కినట్లు కనిపిస్తోంది. VVPAT ట్రయిల్ మెషిన్ ఓటు నమోదు చేసినట్లు చూపించడం వివాదాస్పదమైంది.
ఇది కూడా చదవండి: Viral News : లెక్క తప్పిన లేడీ టీచర్.. విద్యార్థులతో శృంగార పాఠాలు!
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ మొబైల్ ఫోన్‌తో పాటు తన కుమారుడిని పోలింగ్ బూత్‌లోకి ఎలా అనుమతించారని అధికారులను ప్రశ్నించారు. ప్రిసైడింగ్ అధికారి సందీప్ సైనీని సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.