/rtv/media/media_files/2025/08/24/young-man-kissed-rahul-2025-08-24-14-46-20.jpg)
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓట్ చోర్ యాత్ర పేరుతో బీహర్‌లో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. కాగా
ఓట్ చోర్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. దీంతో ఆయనతోపాటు రాహుల్ భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
RG ko kiss kr liya ek ladke ne security wale ne thappad de diya😂 pic.twitter.com/Kmm2JUIsBQ
— Parinda🕊 (@Parthian_1) August 24, 2025
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీహర్‌లో చేపట్టిన ఓట్ చోర్ యాత్రలో ఊహించని ఘటన చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఎదురుగా వచ్చిన ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి రాహుల్‌కు ముద్దు పెట్టాడు. సడెన్‌గా జరిగిన ఈ పరిణామంతో.. రాహుల్ గాంధీతోపాటు ఆయన భద్రత సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని.. ఆ ముద్దు పెట్టిన వ్యక్తిని గట్టిగా పక్కకు లాగి.. రెండు తగిలించారు. అయితే యువకుడు ముద్దు పెట్టినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం తన బైక్‌ను ఆపకుండా ముందుకు సాగిపోయాడు. దీంతో యాత్ర అలాగే కొనసాగింది.
ఈ ఘటన ఆదివారం బిహర్(Bihar) లోని పుర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓట్ చోర్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బిహార్‌లో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ క్రమంలో ఈ యాత్రకు విధుల్లో భాగంగా భద్రత కల్పిస్తున్న పోలీసులతోపాటు ప్రజలు వివిధ కారణాలతో తీవ్రంగా గాయపడుతున్నారు. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ యాత్ర.. సెప్టెంబర్ 1న బిహర్ రాజధాని పాట్నాలో ముగియనుంది. బిహార్ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. అంతే కాకుండా.. భారీగా నకిలీ ఓట్లు.. ఓటర్ల జాబితాలో వచ్చి చేరాయంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. మీరు చేసిన ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని.. లేకుంటే క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం సూచించింది.
Also Read : అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు
యాత్రలో మళ్లీ అపశృతి
#WATCH | Bihar: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi and RJD leader Tejashwi Yadav ride motorbikes during their 'Voter Adhikaar Yatra' in Purnea pic.twitter.com/Dd7uaSyPPj
— ANI (@ANI) August 24, 2025
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ చోర్ ఓట్ యాత్ర(Rahul Gandhi Chore Vote Yatra) లో మరోసారి అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం ఈ యాత్రలో ఆయన చేపట్టిన బైక్ ర్యాలీ లో.. వెనుక వస్తున్న ఒక బైక్ పడిపోయింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తులు కింద పడిపోయారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. దాంతో ర్యాలీలో పాల్గొన్న వారు.. వెంటనే స్పందించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పుర్ణియా జిల్లాలో ఆదివారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాందీ ఈ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read : బిహార్ ఓటర్ లిస్ట్‌లో ఇద్దరు పాకిస్తానీలు
బిహార్‌లో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఆగస్ట్ 16 న రాష్ర్టంలోని ససారాంలో ఎంపీ రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర నవాడా జిల్లాలో కొనసాగుతున్న సమయంలో.. ఆయన కారు కింద కానిస్టేబుల్ ఒకరు పడిపోయారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని రక్షించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. అయితే ఈ విషయమైరాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ యాత్రలో బైక్ ర్యాలీ జరుగుతున్న వేళ.. మళ్లీ ప్రమాదం చోటు చేసుకోంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఆగస్టు 1వ తేదీన పాట్నాలో ముగియనుంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఎన్డీయే భావిస్తుండగా.. ఆ పార్టీ అధికారానికి గండికొట్టాలని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రయత్నిస్తున్నాయి.