Womens Day special: తల్లి ప్రేమకు అవధుల్లేవు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

ఒక తల్లి తన బిడ్డ కలలను నెరవేర్చడానికి చేసిన పని అందరినీ ఫిదా చేస్తుంది. తన కూతురికి ఇంట్లోనే రోలర్ కోస్టర్ రైడ్ అనుభవాన్ని అందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియోలో చిన్నారి ఓ వైపు నవ్వుతూ.. మరోవైపు భయపడుతూ కనిపించి అట్రాక్ట్ చేసింది.

New Update

తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తల్లి ప్రేమ అవధుల్లేనిది. ఎంత వద్దనుకున్నా జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే. అమితమైన ప్రేమ అమ్మ.. అంతులేని అనురాగం అమ్మ.. అలుపెరగని ఓర్పు అమ్మ.. అద్భుతమైన స్నేహం అమ్మ.. అపురూపమైన కావ్యం అమ్మ.. అరుదైన రూపం అమ్మ.. అందుకే నవ మాసాలు మోసి.. కని, పెంచిన తల్లి ప్రేమను కొలవడం కష్టం. 

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

మహిళల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియోలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ తన కూతురు పట్ల చూపించే ప్రేమకు నెటిజన్లు మంత్రముగ్దులయ్యారు. ఒక తల్లి తన బిడ్డల కలలను నెరవేర్చడానికి ఎంతకైనా తెగిస్తుంది అనడానిక ఆ వీడియో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

వీడియో వైరల్

ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన చిన్నారి చిట్టితల్లికి తన ఇంట్లోనే రోలర్ కోస్టర్ రైడ్ అనుభవాన్ని అందించింది.  తన బిడ్డకు రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వడానికి కుర్చీని ఉపయోగించింది. తన ఒడిలో చిన్నారి కూతురిని కూర్చోబెట్టి.. ఆపై కుర్చీని అటు ఇటు ఊపుతూ కనిపించింది. ఆ సమయంలో ఆ చిన్నారి రైడింగ్ అనుభవాన్ని ఆస్వాదిస్తూ బాగా ఎంజాయ్ చేసింది. ఒక పక్క నవ్వుతూ.. మరోపక్క భయం భయంతో కనిపించింది. 

Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

ఇలాంటి ప్రేమను ఒక తల్లి తప్ప ఇంకెవరు ఇవ్వగలరు. అందుకే తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరని అంటారు. అందుకు సంబంధించిన వీడియోను "ది ఫిగెన్" అనే యూజర్ (X)లో ‘‘అమ్మ ఇంటర్నెట్‌ను గెలుస్తుంది’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి దాదాపు 15.6 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఆ వీడియోలో ఉన్న తల్లి ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ మేరకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు