VIRAL VIDEO: ఇదెక్కడి అరాచకం.. బట్టలు విప్పి విమానంలో రచ్చ రచ్చ చేసిన మహిళ.. వీడియో చూశారా?

హ్యూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ హల్ చల్ చేసింది. అకస్మాత్తుగా తన బట్టలు విప్పి దాదాపు 25నిమిషాల పాటు విమానంలో నగ్నంగా తిరగింది. ఫ్లైట్ ఆపండి ఆపండి అంటూ గోలగోల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
Woman strips naked, screams on Southwest flight

Woman strips naked, screams on Southwest flight

హ్యూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ హల్ చల్ చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే రచ్చ రచ్చ చేసింది. అకస్మాత్తుగా తన బట్టలు విప్పి దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు విమానంలో నగ్నంగా తిరగడంతో కలకలం సృష్టించింది. విలియం పి. హాబీ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన తర్వాత సోమవారం ఈ సంఘటన జరిగింది.

Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ

బట్టలు విప్పి రచ్చరచ్చ

విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ మహిళ విమానంలో అకస్మాత్తుగా తన బట్టలు విప్పింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడితో ఆగని ఆ మహిళ ఆపండి, ఆపండి, ఆపండి అంటూ కేకలు వేస్తూ రచ్చ చేసింది. అంతేకాకుండా కాక్‌పిట్ తలుపును కొట్టి.. విమానం నుంచి తనను దింపేయాలని అరుపులు అరుస్తూ గోల గోల చేసింది.  దాదాపు 25 నిమిషాల పాటు ఇలాగే ప్రవర్తించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ బట్టలు లేకుండా చాలా గందరగోళంగా అరుస్తూ కనిపించింది. 

Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!

చివరికి విమాన సిబ్బంది హూస్టన్ పోలీసులు ఆ మహిళను దుప్పటితో కప్పి విమానం నుండి బయటకు తీసుకెళ్లారు. ఆపై ఆమెను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం పంపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆ మహిళ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని తెలిసింది.

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

ఇక ఈ సంఘటనపై సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కారణంగా జరిగిన ఆలస్యానికి విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఇక అనేక మంది ప్రయాణికులు సైతం తమ బాధను తెలిపారు. ఇది చాలా అసౌకర్యంగా అనిపించిందని.. నిజంగా భయపడి పోయామని కొందరు ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు