/rtv/media/media_files/2025/03/07/l917j8zK1OPznk2fYaqo.jpg)
Priyanka Chopra selling her properties in Mumbai
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముంబైలోని తన అత్యంత విలాసవంతమైన కొన్ని ఫ్లాట్‌లను అమ్మెస్తున్నట్లు తెలుస్తోంది. అంథేరిలోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లోని ఫ్లాట్‌లు భారీ డిమాండ్ పలుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాటిన్నింటినీ రూ.16.17 కోట్లకు విక్రయించగా కేవలం 19వ అంతస్తు జోడీ యూనిట్ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేసిందట.
18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్..
ఈ మేరకు 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్ రూ.3.45, రూ.2.85, రూ.3.52 కోట్లకు అమ్ముడుపోయాయి. మార్చి 3వ తేదీన ఇందుకు సంబంధించిన లావాదేవీలు పూర్తైనట్లు కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే 2021లో వెర్సోవాలోని రెండు ఆస్తులను, 2023లో లోఖండ్‌వాలాలోని రెండు పెంట్ హౌస్‌లను ప్రియాంక విక్రయించింది. గోవా, న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్‌లో ఆమెకు సొంత భవనాలున్నాయి.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
ఇక భర్త నిక్‌జోనస్, కూతురు మేరీ చోప్రా జోన్స్ కలిసి లాస్ ఏంజెలెస్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లఫ్’ సినిమాల్లో నటిస్తోంది. అమెరికన్ సిరీస్ ‘సిటడెల్’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో రాజమౌళి తీస్తున్న #SSMB29లో స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.