/rtv/media/media_files/2025/03/07/jx8pE61H9brqZHfoj9yD.jpg)
Tahawwur Rana Photograph: (Tahawwur Rana)
2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడు తహవ్యూర్ రాణాని ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. పాక్ అమెరికన్ సిటిజన్ అయిన రాణాని అమెరికా భారత్‌కు అప్పగించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ రాణాని భారత్‌కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఇరు దేశాలు చాటి చెప్పాయి. ఈ అప్పగింతను అడ్డుకునేందుకు రాణా అమెరికా ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు.
Also read: Israel Rescues Indians: పాలస్తీనాలో చిక్కుకున్న 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయిల్
#BREAKING: The US Supreme Court denies Tahawwur Rana’s emergency stay application, moving him closer to extradition to India for his role in the 2008 Mumbai attacks. His attorney now appeals to Chief Justice Roberts. #MumbaiAttack #TahawwurRana pic.twitter.com/BAI8vumEW6
— Kedar (@shintre_kedar) March 7, 2025
పాక్-అమెరికన్ పౌరుడైన తహవ్వూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. 2025 ఫిబ్రవరి 28న తన అప్పగింతపై అత్యవసర స్టే కోరుతూ అమెరికా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అమెరికా కోర్టులో తహవ్యూర్‌కు ఎదురదెబ్బ తగిలింది. కచ్చితంగా రాణా భారత్ రావాల్సిందే.
మార్చి 2, 2025న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి కేసుని ఉదహరిస్తూ, రాణా తన అత్యవసర పిటిషన్‌ని దాఖలు చేశాడు. భారత్‌కి అప్పగిస్తే తనను చిత్రహింసలు పెడతారనే సాకుని చూపించిన, అప్పగింతను నిలిపేయాలని కోరాడు. ఆ పిటిషన్‌ను అమెరికా అత్యున్నత న్యాయ స్నానం తిరస్కరించింది. దీంతో తహవ్వూర్ రాణా భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది.