Yogi Adithya Nath:
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జోరుగా కొనసాగుతోంది. దీంట్లో అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ అందరికీ ఆసక్తి కలిగించింది. ప్రచార సభలో యోగి మాట్లాడుతూ ఖర్గే చిన్ననాటి సంఘటనలు గుర్తు చేశారు. సాధువులు, కాషాయం అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టారు. బ్రిటీష్ హయాంలో హైదరాబాద్‌లోని ఒక గ్రామంలో ఖర్గే ఇంటిని ఇస్లామిక్ మిలీషియా దహనం చేయడంతో ఆతడి తల్లి, కుటుంబ సభ్యులు మరణించారు. ఖర్గే అవన్నీ మర్చిపోయారు. ఓటు బ్యాంఉ కోసం తన భావాలన్ని దాచుకుని రీ పని చేస్తున్నారని యెద్దేవా చేశారని యోగి అన్నారు. ఖర్గేకి నాపై కోపం ఉంది. కానీ యోగికి దేశం ముందుంటుంది. మీకు మాత్రం కాంగ్రెస్‌ని బుజ్జగించడమే ప్రధానం అని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా..
Also Read : ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!
అంతకుముందు కాంగ్రేస ఛీఫ్ ఖర్గే మాట్లాడుతూ.. బాటేంగే తో కటేంగే అనే యోగి నినాదాన్ని విమర్శించారు. చాలా మంది రాజకీయ నేతలు.. సాధువుల వేషధారణలతో మోసం చేస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు అంటూ యోగని విమర్శిస్తూ మాట్లాడారు. దాంతో పాటూ సన్యాసివి అయితే రాజకీయాల నుంచి తప్పుకో అంటూ ఘాటుగా ఖర్గే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
Also Read : వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే