ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్! కొండగల్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. ఘటనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉంటే బీఆర్ఎస్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పొలం పోతుందనే కడుపు మంటతోనే సురేష్ తనకు ఫోన్ చేశాడని చెప్పారు. By srinivas 12 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Kodangal: కొండగల్ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన నరేందర్.. సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త తనతో రోజు మాట్లాడుతుంటాడని, దానికి అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే ఫార్మా కంపెనీ విషయంలో గ్రామస్తులంతా తమ భూములు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఘటనలో వాళ్లు కూడా ఉన్నారు.. 'లగచర్ల గ్రామంలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మా బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ రోజు వివిధ పనుల కోసం నాతో మాట్లాడతాడు. సురేష్ కు 7 ఎకరాల పొలం ఉంది. అతనికి కూడా కడుపు మంట ఉంది. పొల్యూషన్ వచ్చే కంపెనీలు వద్దంటున్నాం. టెక్స్ టైల్స్, ఐటీ కంపెనీలు డెవలప్ అయ్యే కంపెనీలు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. పొల్యూషన్ వచ్చే కంపెనీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: Devisri Prasad : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా? కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి జరిగిన విషయం విషయం తెలిసిందే. కాగా లగచర్లలో పరిస్థితిని తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వస్తుండగా మన్నెగూడ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగానే మన్నెగూడ పోలీస్ స్టేషన్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. #brs #congress #kodangal #collector మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి